Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీకు ముంబై నచ్చదా? కాంగ్రెస్‌ విమర్శలపై జైశంకర్ కౌంటర్

S Jaishankar counters Congress criticism over Mumbai meeting with Marco Rubio
Advertisement
  • ముంబైలో అమెరికా మంత్రితో భేటీపై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన జైశంకర్
  • ఇందిరా గాంధీ, సల్మాన్ ఖుర్షీద్‌ల భేటీలను గుర్తు చేసిన వైనం
  • ఢిల్లీ బయట సమావేశాలు దశాబ్దంగా జరుగుతున్నాయని వెల్లడి
Advertisement
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ముంబైలో భేటీ కావడంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఈ విమర్శల వెనుక ఉన్న ఆంతర్యాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని వ్యాఖ్యానిస్తూ.. "విపక్షాలకు ముంబై అంటే ఇష్టం లేదా? లేక ముంబై నగరానికే వారంటే పడదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గురువారం ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. ముంబై భేటీని 'సమన్లు జారీ చేయడం'గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. ఇటువంటి సున్నితమైన అంశాలపై పరిణతితో కూడిన చర్చలు జరగాలని ఆయన సూచించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఢిల్లీ వెలుపల అనేక దౌత్య సమావేశాలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పాక్ నేత జుల్ఫికర్ అలీ భుట్టోతో చర్చల నిమిత్తం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సిమ్లా వెళ్లిన విషయాన్ని, అలాగే పాక్ ప్రధానితో సమావేశం కోసం సల్మాన్ ఖుర్షీద్ జైపూర్ వెళ్లిన ఉదంతాలను ఆయన ఉదహరించారు.

గత పదేళ్లుగా విదేశీ ప్రముఖులకు దేశ రాజధాని ఢిల్లీ వెలుపల ఆతిథ్యం ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారిందని విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. స్పెయిన్ ప్రధానితో బరోడాలో, జర్మన్ ఛాన్సలర్‌తో అహ్మదాబాద్‌లో, మారిషస్ ప్రధానితో వారణాసిలో, అలాగే గోవాలో జరిగిన ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సదస్సులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అక్టోబర్ 19, 20 తేదీల్లో ముంబైలో యూఏఈ, అమెరికా విదేశాంగ మంత్రులకు జైశంకర్ ఆతిథ్యం ఇచ్చారు. ఇదే క్రమంలో అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు.
Advertisement
Advertisement
S Jaishankar
Marco Rubio
Mumbai
Congress
Rahul Gandhi
Foreign Policy

More Telugu News